ఆంధ్రా జల దోపిడీ దౌర్జన్యాన్ని ఆపలేని అసమర్థ ప్రభుత్వం
హుజూర్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి.
నేరేడుచర్ల, నవంబర్ 19 (విజయక్రాంతి): ఆంధ్రా జల దోపిడీ(Andhra’s Water Plunder) దౌర్జన్యాన్ని ఆపలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అని హుజూర్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి అన్నారు.నేరేడుచర్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
నాగార్జున సాగర్ నుండి ఆంధ్రావాళ్లు దౌర్జన్యంగా నీటిని దోపిడీ చేస్తుంటే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనబడటం లేదా అని ప్రశ్నించారు.సాగర్ నుండి సొరంగ మార్గం ద్వారా నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నా చేతులు కట్టుకుని చూస్తున్న ఈ అసమర్థ ప్రభుత్వాన్ని ఏమనాలని మండిపడ్డారు.ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. దోపిడీని ఆపడం మీకు చేతకాకపోతే చెప్పండి, వేలాది మంది రైతులతో తామే వెళ్లి ఆపుతామని స్పష్టం చేశారు. రైతులు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
ఎనకటి రోజులు తెస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి తన మాటను నిజం చేస్తున్నాడని, ఆంధ్రా పెత్తందారులకు తొత్తుగా మారిన రేవంత్ రెడ్డి, చేతగాని మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు అరిబండి సురేష్ బాబు, మాజీ డీసీసీబీ డైరెక్టర్, కౌన్సిలర్ దొండపాటి అప్పిరెడ్డి,
హుజూర్నగర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, నేరేడుచర్ల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు నాగండ్ల శ్రీధర్, ఇంజమూరీ యశోద రాములు, సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ చెన్నబోయిన సైదులు, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి చిత్తలూరీ సైదులు,మండల పార్టీ మాజీ ఉపాధ్యక్షులు వసకుల సుదర్శన్, సీనియర్ నాయకులు ఇనుపాల పిచ్చి రెడ్డి , యూత్ నాయకులు పోకబతిని శేఖర్, మాజి sc సెల్ అధ్యక్షులు నందిపాటి గురవయ్య,తదితరులు పాల్గొన్నారు.