మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం
బోథ్. నవంబర్ 19 ( విజయ క్రాంతి): మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ బూతు నియోజకవర్గ ఇన్చార్జి ఆడేగజేందర్ పేర్కొన్నారు. సోనాల మండలంలోని మహదుగూడ లో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను లక్ష అధికారులుగా చేయడం లక్ష్యంగా పెట్టుకొని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. అంతేగాక మహిళా సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో కీలకపాత్ర పోషించి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చేనేందుకు తీసుకోవలసిన చర్యల గురించి సమావేశంలో చర్చించేందుకు భవనాల నిర్మాణం కొనసాగుతుందన్నారు.
కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆత్రం లక్ష్మణ్, ఉప సర్పంచ్ సీడంలక్ష్మి ,ఆత్రం గోవిందరావు, పటేల్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు చౌహాన్ వినోద్ సింగ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల పోతన్న, పిఎసిఎస్ డైరెక్టర్ లోలపు పోశెట్టి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగ్రం, దేవుల నాయక్ తండ ఉప సర్పంచ్ అరవింద్, నాయకులు కసిరి పోతన్న,
నల్ల విజయ్, కుమార్ రెడ్డి, చిలుకూరి నరేందర్, సిడం రాదాబాయి, ఆత్రం సుశీల, మెస్రం సోనీ భాయ్, గడ్డం బండి, మండాడి పార్వతి, బుక రాములు, మాజీ సర్పంచ్ రాందాస్ ,ఎండి సద్దాం ,బలిరాం, అమృతరావ్, పటేల్, సురేష్, సురేందర్ సింగ్, మాధవ్, పరుశురాం, తదితరులు పాల్గొన్నారు.