అగ్నిప్రమాదంలో పంట నష్టపోయిన రైతు
తాంసి/భీంపూర్,నవంబర్19 (విజయక్రాంతి): భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి గ్రామానికి(Pippal Koti village) చెందిన కౌలు రైతు షేక్ జావీద్ మొక్కజొన్న పంట పొలంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో సుమారు 10 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా అగ్నికి ఆహుతైంది.ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) గురువారం పంట పొలాన్ని సందర్శించి జరిగిన నష్టాన్ని పరిశీలించారు.
తీవ్రంగా నష్టపోయిన రైతు షేక్ జావీద్ నీ పరామర్శించి, ధైర్యం చెప్పారు.తక్షణ సహాయంగా రూ.20,000 ఆర్థిక సహాయం అందజేశారు. అంతేకాకుండా, ప్రభుత్వం తరఫున కూడా రైతుకు అన్ని విధాలా న్యాయం జరిగేలా, తగిన ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఆపదలో ఉన్న రైతులకు అండగా నిలుస్తూ, వారి కష్టాల్లో భాగస్వాములమవుతామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా భరోసా కల్పించారు.. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రమేష్ నాయక్,మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి..నాయకులు మేకల నాగయ్య,కేమ శ్రీకాంత్,షేక్ ఆఫ్రోజ్,కేమ గంగయ్య,మల్లెల స్వామి,శ్రీనివాస్ రెడ్డి,మార్చెట్టి అనిల్, తదితరులు పాల్గొన్నారు.