ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
ఏసీఎంఓ పి. ఉద్ధవ్
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): గిరిజన సంక్షేమ పాఠశాల(Tribal Welfare School)ల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని ఏసీఎంఓ పి. ఉద్ధవ్(ACMO P Uddhav) సూచించారు. గురువారం దంతన్‌పల్లి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని భీమ్‌జీగూడ, బుగ్గగూడ, చింతనమాదర, మర్కగూడ, నాగుగూడ ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. బోధనా ప్రణాళిక ప్రకారం పాఠ్యాంశాలు పూర్తి చేసి మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సీఆర్‌పీ కనక కైలాస్ పాల్గొన్నారు.