రాష్ట్ర కార్యదర్శిగా షేక్ మౌలానా
భైంసా (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్స్ అసోసియేషన్(Telangana State Ration Dealers Association) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికైన షేక్ మౌలానా నియమితులయ్యారు. ఆయనను నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. శ్రీహరి రావు మాట్లాడుతూ తన సొంత మండలానికి చెందిన వ్యక్తి డీలర్ల సంఘం రాష్ట్ర నాయకునిగా ఎదగడం గర్వించదగ్గ విషయమని అన్నారు.
రేషన్ డీలర్లకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పట్ల స్పందించి పరిష్కరించేందుకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమిరెడ్డి ద్వారక నగర్ అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి, రమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.