ఎస్.పి ఎం మైదానంలో పేరుకుపోయిన చెత్త చెదారం
సందర్శకులకు తప్పని ఇబ్బందులు
కాగజ్ నగర్, నవంబర్ 19 ( విజయక్రాంతి): కొందరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు(Sirpur Paper Mill) క్రీడ మైదానంలో చెత్తాచెదారం పేరుకు పోవడంతో సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఇక్కడ వాకింగ్ చేయడానికి వచ్చేవారు చెత్తాచెదారం నుండి వెలుబడే దుర్వాసన వల్ల ఇబ్బందులు పడుతున్నారు.
అలాగే గ్రౌండ్ లో క్రికెట్, వాలీబాల్ ఆటలాడుకునే క్రీడాకారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ ( ఎం) కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ సభ్యులు ముంజం ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. ఈనెల 16వ తేదీన నిర్వహించిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం సందర్భంగా వాడి వదిలేసిన పేపర్ ప్లేట్లు, గ్లాసులు ఇతర ప్లాస్టిక్ వ్యర్ధాల వల్ల ఈ మైదానం చెత్త చెదారంతో నిండిపోయింది. వెంటనే సందర్శకుల సౌకర్యార్థం యాజమాన్యం పారిశుద్ధ్య చర్యలు చేయాలని సందర్శకులు కోరుతున్నారు.