ఐదుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్
రూ.47,000 నగదు, 6 మొబైల్ ఫోన్లు, 52 ప్లేయింగ్ కార్డులు స్వాధీనం
జైనథ్ సీఐ జి శ్రావణ్
బేల నవంబర్14(విజయక్రాంతి): పోలీస్ స్టేషన్(Police Station) పరిధిలోని బేల గ్రామం పుసం కాంప్లెక్స్(Bela Village Pusam Complex) సమీపంలో బహిరంగ ప్రదేశంలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న ఐదుగురు పేకాటరాయుళ్లను(Poker players) పోలీసులు అరెస్ట్ చేశారు. 14.11.2026 తేదీన మధ్యాహ్నం 3:45 గంటల సమయంలో పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా పుసం కాంప్లెక్స్ సమీపంలో ఐదుగురు వ్యక్తులు డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతుండగా పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు అయిన నిందితుల వివరాలు:
1. డార్నే మనీష్
2. అగార్కర్ అజయ్
3. షేక్ అహ్మద్
4. థాక్రే మనీష్ కుమార్
5. సౌరబ్ సంజయ్ జిద్దేవర్
వారి వద్ద నుండి రూ.47,000 నగదు, 6 మొబైల్ ఫోన్లు, పేకాట ముక్కలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. బేల ఎస్ఐ వై మధుకృష్ణ పాల్గొన్నారు.