పారమిత విద్యాసంస్థలలో బాలల దినోత్సవ వేడుకలు

14-11-2026 | 11:39pm

కొత్తపల్లి , నవంబర్ 14(విజయక్రాంతి): కరీంనగర్(Karimnagar) నగరంలోని పారమిత విద్యాసంస్థలల్లో(Paramitha Educational Institutions) బాలల దినోత్సవ వేడుకలను(Children's Day celebrations) అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థుల(Students') కోసం ప్రత్యేకంగా ఫుడ్ ఫెస్టివల్, క్విజ్ పోటీలు, వివిధ రకాల వినోదభరితమైన ఆటలు, సరదా కార్యక్రమాలు నిర్వహించారు. ఫుడ్ ఫెస్టివల్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమకు ఇష్టమైన ఆహార పదార్థాలను ఆస్వాదించారు. క్విజ్ పోటీల ద్వారా తమ జ్ఞానాన్ని ప్రదర్శించగా, ఆటలు, ఇతర వినోద కార్యక్రమాలు చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపాయి. 

 ఈ సందర్భంగా పారమిత విద్యాసంస్థల చైర్మన్ డా. ఇ. ప్రసాదరావు విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఇట్టి కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల  డైరెక్టర్లు ప్రసూన, అనూకర్ రావు, రశ్మిత, వినోద్ రావు, రాకేశ్, వి.యు.ఎం. ప్రసాద్, హన్మంతరావు, ప్రధానోపాధ్యాయులు బాలాజీ, ప్రశాంత్, కవిత, శ్రీకర్, గోపీకృష్ణ, సమన్వయ కర్తలు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు