మండల కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

14-11-2026 | 11:46pm

గండీడ్,నవంబర్ 14 విజయక్రాంతి : మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(Kasturba Gandhi Balika Vidyalaya)(కేజీబీవీ)లో శనివారం బాలల దినోత్సవ వేడుకలను(Children's Day celebrations) ఘనంగా నిర్వహించారు. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) జయంతిని పురస్కరించుకుని పాఠశాల ప్రాంగణంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ ఆర్. భగవంత్ రెడ్డి, ఉప సర్పంచ్ గుముడాల చెన్నయ్య, గ్రామ కార్యదర్శి పోకల వెంకట్ రాములు హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులు దేశ ప్రగతిలో బాలల పాత్ర, నెహ్రూజీకి పిల్లలపై ఉన్న ప్రేమాభిమానాల గురించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బాలలు చదువుతో పాటు క్రీడలు, ఇతర రంగాల్లో రాణించి దేశ భవిష్యత్తుకు వెలుగులుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయినులు, సిబ్బంది, వార్డు సభ్యులు హస్నాబాద్ చంద్రయ్య, సునీల్ కుమార్,కారోబార్ పెంటయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు