వీరాంజనేయ నాగ దోష నివారణ విగ్రహ ప్రతిష్టాపన
బోథ్. నవంబర్ 16 (విజయ క్రాంతి): మండల కేంద్రంలోని 14వ బ్లాక్ న్యూ కాలనీలో హనుమాన్ నాగ దోష నివారణ(Hanuman Naga Dosha Nivarana ) విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. ఈ సందర్భంగా ప్రత్యేక హోమం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు.
కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మెరుగు భోజన్న, ఆత్మ చైర్మన్ జి. రాజు యాదవ్, టి పి సి సి ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్, కుచ్చలాపూర్ సర్పంచ్ మైలి నారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి అచ్చితానంద రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మీరు నరసింహాదాస్, మాజీ ఎంపిటిసి షేక్ తోపాటు నాయకులు కొండస్వామి తదితరులు పాల్గొన్నారు.