వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
16-11-2026 | 07:57pm
దండేపల్లి, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మామిడిపల్లిలో(Mamidipalli) IKP వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(IKP paddy procurement center) గ్రామ సర్పంచ్ ఏల్తపు వైష్ణవి శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐకేపీ సీసీ దుర్గం శ్రీనివాస్, వార్డు సభ్యుడు గొట్ల మహేందర్, పత్తిపాక తిరుపతి, జంజీరాల పెద్దులు, కంది శంకరయ్య, గెల్లి వెంకన్న, మహిళ సభ్యులు జీవిత, భవాని, హామాలీలు రైతులు తదితరులు పాల్గొన్నారు.