సీపీఎస్ ఉద్యోగుల సామూహిక సెలవు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ధర్నాకు దోమకొండ ఉద్యోగుల తరలింపు
దోమకొండ, నవంబర్ 16 (విజయ క్రాంతి): సీపీఎస్ విధానాన్ని రద్దు(Abolition of the CPS system) చేయాలని కోరుతూ నిర్వహిస్తున్న ఉద్యమంలో భాగంగా దోమకొండ మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల్లో(MPDO Office) పనిచేస్తున్న సీపీఎస్ ఉద్యోగులందరూ సామూహిక సెలవు పెట్టి కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నా కార్యక్రమానికి హాజరుకావాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో టీఎస్‌సీపీఎస్‌ఈయూ మండల అధ్యక్షుడు కె. బాలకిషన్, ప్రధాన కార్యదర్శి సందీప్‌తో పాటు గోవిందరాజ్, లింబాద్రి, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ శాఖలకు చెందిన సీపీఎస్ ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.