ధరణి కాలనీ సమస్యలపై జోనల్ కమిషనర్‌కు వినతి
కాలనీవాసులతో కలిసి సమస్యలను వివరించిన కాంగ్రెస్ నాయకులు తుంగతుర్తి రవి
మేడిపల్లి, నవంబర్ 16 (విజయక్రాంతి): మేడిపల్లి డివిజన్(Medipally Division) పరిధిలోని ధరణి కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరుతూ సోమవారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు(Division Congress Presidents) తుంగతుర్తి రవి, కాలనీవాసులు జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా తుంగతుర్తి రవి కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆమె సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన పనులను మంజూరు చేయడంతో పాటు, సంబంధిత పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు చంద్రశేఖర్ చింతం, జనరల్ సెక్రటరీ బీమిడి శ్రీనివాస్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, శేఖర్ గౌడ్, సతీష్, అయిలయ్య యాదవ్, మహేశ్వరప్ప, కపిల్ తదితరులు పాల్గొన్నారు.