కరీంనగర్ హాకీ క్లబ్ పై కలెక్టర్‌కు ఫిర్యాదు

16-11-2026 | 07:52pm

కరీంనగర్ సిటీ, నవంబర్ 16(విజయ క్రాంతి): కరీంనగర్ హాకీ క్లబ్(Karimnagar Hockey Club) వ్యవహారంలోని పరిణామాలు, తలెత్తిన వివాదాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ హుజూరాబాద్ హాకీ క్లబ్ ప్రధాన కార్యదర్శి బోడిగె తిరుపతి గౌడ్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ నంబర్ 46/2016 పరిధిలో క్లబ్ కార్యకలాపాలు,

ఆస్తులు, నిధుల వినియోగంపై పలు అంశాలను ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.క్లబ్ అభివృద్ధికి, క్రీడాకారులకు న్యాయం జరిగేలా సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని తిరుపతి గౌడ్ కలెక్టర్‌ను కోరారు. హుజూరాబాద్ ప్రాంతంలో హాకీ క్రీడకు పూర్వవైభవం తీసుకురావడంతో పాటు యువ క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు