ఘనంగా 27వ ఫులాజీ బాబా వార్షిక మహోత్సవం

16-11-2026 | 07:45pm

బేల నవంబర్ 16 (విజయక్రాంతి): బేల మండలంలోని సొంఖాస్ గ్రామంలో 27వ ఫులాజీ బాబా వార్షిక మహోత్సవాన్ని(Fulaji Baba Annual Festival) భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫులాజీ బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహోత్సవంలో గ్రామస్థులు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వామ్నరావు ఇంగలే, శెండే దీపక్, నాగోశే నందు, అంబాదాస్, సునీల్, అవినాష్, విశాల్, రాజారాం, భక్తులు గ్రామస్థులు పాల్గున్నారు.

మరిన్ని వార్తలు