అంగన్‌వాడీ చిన్నారులకు స్కూల్ యూనిఫామ్‌ల పంపిణీ

16-11-2026 | 07:48pm

మల్లాపూర్, నవంబర్ 16 (విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట, గుండంపల్లి గ్రామాల్లో అంగన్‌వాడీ చిన్నారుల(Anganwadi Children)కు స్కూల్ యూనిఫామ్‌లు, దుస్తులను పంపిణీ చేశారు. మొగిలిపేట గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో 3వ వార్డు సభ్యుడు జంగ ప్రణయ్ చిన్నారులకు యూనిఫామ్‌లు పంపిణీ చేయగా, గుండంపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం–1, కేంద్రం–2లో గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య చిన్నారులకు స్కూల్ దుస్తులను అందజేశారు.

ఈ సందర్భంగా చిన్నారుల విద్యాభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నారులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి భవిష్యత్తుకు పునాదులు వేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో మొగిలిపేటలో రమణ, బీఎల్వో పుష్ప, గుండంపల్లిలో ఉప సర్పంచ్ జగ్గుల గంగాధర్, గ్రామపంచాయతీ కార్యదర్శి కవిత, అంగన్‌వాడీ టీచర్లు మ్యాదరి రాధా, మిట్టపల్లి రాధా, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు