అర్హులైన ప్రతి ఇంటికి ఇందిరమ్మ బీమా దరఖాస్తు చేయించండి

16-11-2026 | 05:51pm

బోథ్. నవంబర్ 16 ( విజయక్రాంతి): అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా(Indiramma Bima Scheme) వర్తించే విధంగా చూడాలని సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలు వివిధ గ్రామాల కార్యదర్శిలు జిపిఓలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పై అవగాహన కలిగించారు. 19 నుండి గ్రామాలలో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని వెంటనే ఆన్లైన్ చేయాలని పేర్కొన్నారు. 18 నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న వారికి ఈ భీమ వర్తిస్తుందని తెలిపారు. కుటుంబ యజమానికి వర్తిస్తుందన్నారు. గ్రామ పంచాయతీలో ఉన్న ఉద్యోగస్తులు సైతం ఈ పథకానికి అర్హులు అనితెలిపారు.

మరిన్ని వార్తలు