చెట్ల నరికివేత పై చర్యలు తీసుకోవాలి
మహబూబాబాద్ టౌన్, నవంబర్ 16 (విజయక్రాంతి):కేసముద్రం మున్సిపాలిటీ(Kesamudram Municipality) పరిధిలో ప్రభుత్వ భూమిలోని చెట్ల అక్రమ నరికివేతపై తక్షణం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ కు బీ ఆర్ ఎస్ వార్డు కౌన్సిలర్లు(BRS Ward Councilors) ఫిర్యాదు చేశారు.
కేసముద్రం మున్సిపాలిటీ 6వ వార్డు పరిధిలోని అమీనాపురం గ్రామంలో గల ప్రభుత్వ భూమిలో ఉన్న రావి, నిద్రగన్నేరు చెట్లను అక్రమంగా నరికి, నకిలీ పత్రాలతో కలపను తరలించే ప్రయత్నం జరిగిందని కేసముద్రం మున్సిపల్ కౌన్సిలర్లు ఆరోపించారు.
ఈ వ్యవహారంలో మున్సిపల్ చైర్పర్సన్ సునీత ప్రమేయంతో భారీ అవకతవకలు, అధికార దుర్వినియోగం జరిగాయని పేర్కొంటూ సోమవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన 'ప్రజావాణి' కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆధారాలతో కూడిన ఫిర్యాదు ఫిర్యాదు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మున్సిపాలిటీ కౌన్సిలర్లు శరత్ యాదవ్, వినయ్ రెడ్డి, రాము, డి. కృష్ణ, బానోత్ అరుణ,శారద, సుజాత పాల్గొన్నారు.