బోర్వెల్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ

16-11-2026 | 06:04pm

సుల్తానాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): గత కొంతకాలంగా మున్సిపల్ పరిధిలోని 6, 7 వార్డులలో గల స్మశాన వాటిక బోర్వెల్ గత కొంతకాలంగా పనిచేయక పోవడంతో, స్మశాన వాటిక వద్ద స్నానాలకు, ఇతర అవసరాలకు నీటి కొరత ఏర్పడడంతో, ఆరు ఏడవ వార్డు ప్రజలు ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు(MLA Chinthakunta Vijayaraman Rao) దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే స్పందించి మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ ఆరవ వార్డు కౌన్సిలర్ భాకం సాయికిరణ్ యాదవ్, ఏడవ వార్డు కౌన్సిలర్ ఉట్ల వర ప్రదీప్ లను రెండు బోర్వెలను పునరుద్ధరించాలని ఆదేశించగా, వెంటనే స్పందించి బోర్వెల్ పునరుద్ధరించారు.

పునరుద్ధరించిన బోర్వెల్ ను సోమవారం మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ కౌన్సిలర్లు ఉట్ల వర ప్రదీప్, బాకం సాయికిరణ్ యాదవ్ లు మాట్లాడుతూ, ప్రభుత్వ విప్ విజయ రమణారావు సుల్తానాబాద్ మున్సిపల్ ను సుందరంగా తీర్చిదిద్దేందుకు కోట్లాది రూపాయలతో నిరంతర అభివృద్ధి ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. సుల్తానాబాద్ మున్సిపల్ లో ఏ అభివృద్ధి పని అడిగిన వెంటనే స్పందించి నిధులు మంజూరు చేస్తున్నందుకు ప్రభుత్వ విప్ కు కృతజ్ఞతలు తెలిపారు.

రానున్న రోజులలో ఆరు ఏడు వార్డులలో ఇంకా అపరిస్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేస్తామని వారు స్పష్టం చేశారు. రెండు లక్షల రూపాయలతో రెండు బోర్వెల్ లను పునరుద్ధరిస్తున్నట్లు, ఎస్సీ స్మశాన వాటిక బోర్వెల్ కు లక్ష రూపాయలు, శాంతినగర్ బోర్వెల్ కు లక్ష రూపాయలు, రెండు లక్షల రూపాయలతో రెండు బోర్వెల్లను పునరుద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. శాంతినగర్ లో బోర్వెల్ పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సీనియర్ నేతలు న్యాతరి ప్రభాకర్, ఆరేపల్లి ఇలా రావు, న్యాతరి శ్రీనివాస్, న్యాతరి దేవేందర్ ,కుమార్, ఆరేపల్లి హేమన్ రాజ్,న్యాతరి దుర్గయ్య, తాల్లపల్లి ఎల్లయ్య, మహంకాళి శంకరయ్య తోపాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు