పీఏసీఎస్ నూతన డైరెక్టర్‌గా పెంజర్ల శేఖర్ రెడ్డి ఎన్నిక

16-11-2026 | 06:10pm

భిక్కనూర్, నవంబర్ 16 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Primary Agricultural Cooperative Society) (పీఏసీఎస్) నూతన డైరెక్టర్‌గా కంచర్ల గ్రామానికి చెందిన పెంజర్ల శేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. సోమవారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో డైరెక్టర్‌గా అవకాశం కల్పించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి, పలువురు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, సహకార సంఘం ద్వారా రైతులకు అవసరమైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు