చెక్ పోస్ట్ తనిఖీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్

16-11-2026 | 09:18pm

బోథ్ నవంబర్ 16 (విజయక్రాంతి): మండలం సరిహద్దుల్లో ఉన్న గన్పూర్ చెక్పోస్ట్ ను సోమవారం రాత్రి మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ(Mallepula Satyanarayana) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ లో ఉన్న రికార్డును పరిశీలించారు. మార్కెట్ పన్ను చెల్లించకుండా ధాన్యం తీసుకువెళ్తే ఊరుకునేది లేదన్నారు. మార్కెట్ కమిటీ ఆదాయం పెంపు కోసం సిబ్బంది కృషి చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు