ఏడుపాయలకు కాసుల పంట!

16-11-2026 | 09:16pm

* టెండర్ల ద్వారా రూ.2.76 కోట్ల ఆదాయం 

* గతేడాదితో పోలిస్తే రూ.48.45 లక్షలు అధికం

పాపన్నపేట, నవంబర్16: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని దేవస్థానా(Sri Edupayala Vana Durga Bhavani Devalayam)నికి టెండర్ల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. సోమవారం నిర్వహించిన సీల్ టెండర్ కమ్ బహిరంగ వేలం పాటల్లో వివిధ హక్కుల ద్వారా ఆలయానికి రూ.2.76 కోట్ల ఆదాయం లభించింది. గతేడాది రూ.2,27,55,000 ఆదాయం రాగా, ఈసారి రూ.48,45,000 అదనంగా సమకూరినట్లు ఆలయ ఇన్‌చార్జి ఈఓ వీరేశం, సూపరిండెంట్ రంగరావు లు తెలిపారు.

నాలుగు హక్కులకు వేలం

దేవస్థానం వద్ద కొబ్బరికాయలు విక్రయించుకునే హక్కును మెదక్‌కు చెందిన లింగోజి రూ.1,21,10,000కు దక్కించుకున్నారు. ఒడిబియ్యం సేకరణ హక్కును బాలరాజు రూ.1,13,10,000కు పొందారు. పూజా సామగ్రి విక్రయ హక్కును నర్సాగౌడ్ రూ.34,50,000కు, పాదరక్షలు భద్రపరిచే స్థలం నిర్వహణ హక్కును దుర్గాగౌడ్ రూ.7.30 లక్షలకు దక్కించుకున్నారు.

మూడు హక్కులకు వాయిదా

తలనీలాలు, కొబ్బరి ముక్కలు సేకరించుకునే హక్కు, ఎగ్జిబిషన్ నిర్వహణ హక్కులకు టెండరుదారుల నుంచి స్పందన రాకపోవడంతో వాటి వేలాన్ని అధికారులు వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ రంగారావు, అధికారులు సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, శంకర్ శర్మ, రవి కుమార్, యాదగిరి, పాపయ్య, బ్రహ్మ చారి, నరేష్, సాయిబాబా , టెండరుదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు