ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

16-11-2026 | 09:24pm

మున్సిపాలిటీ చైర్ పర్సన్ నివేదిత..

సూర్యాపేట, నవంబర్ 16 (విజయక్రాంతి): మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను  రైతులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత(Municipal Chairperson Nivedita), మార్కెట్  కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు.  సూర్యాపేట మున్సిపాలిటీ పరిదిలోని రాయనిగూడెం-1, రాయని గూడెం -2లో దొడ్డు రకం  కుడకుడ  నందు సన్న రకం  దాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం వారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  రైతులు తేమశాతం పాటించాలని, తాలు ,మట్టి లేకుండా తీసుకొని రావాలని  అన్నారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్,  కౌన్సిలర్ ఎలుగూరి ఇందిర  వీరయ్య గౌడ్, డిఎంసి రమేష్ నాయక్,  టిఎంసి వసంత్ కుమార్, ఆర్ పిలు వినోద, జ్యోతి, సునీత లు పాల్గొన్నారు. ఫణిమ, గౌతమి , కవిత, సంధ్యా రాణి,నాగమణి  పాల్గొన్నారు

మరిన్ని వార్తలు