కవిత ఆరోపణలపై హరీష్ రావు సమాధానం చెప్పాలి
కవితపై విమర్శలు సరికాదు
టీఆర్ఎస్ జిల్లా యూత్ అధ్యక్షులు బుర్ర వినోద్ గౌడ్
భూపాలపల్లి టౌన్, నవంబర్ 16 (విజయక్రాంతి): సిద్దిపేట పర్యటనలో తెలంగాణా రక్షణ చీఫ్ కల్వకుంట్ల కవిత చేసిన అవినీతి ఆరోపణలపై హరీష్ రావు సమాధానం చెప్పకుండా దాట వేశాడని ఆ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా యూత్ అధ్యక్షులు బుర్ర వినోద్(TRS Youth President Burra Vinod Goud) అన్నారు. ఈ సందర్భంగా వినోద్ గౌడ్ మాట్లాడుతూ సోమవారం బీఆర్ఎస్ నేత హరీష్ రావు సమాధానం చెప్పకుండా ఆయన అనుచరుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మాట్లాడించడం సిగ్గుచేటని అన్నారు.
హరీష్ రావుపై కవిత చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవసరం ఉందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాల నిర్వహణ, వెలుగుమట్లలో దళితుల ఇండ్ల కూల్చివేత, సిరిసిల్ల ఇసుక లారీల ఘటనల సమయంలో బీఆర్ఎస్ నేతలు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న కవితక్కపై విమర్శలు చేయడం సరికాదని నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని వినోద్ గౌడ్ పేర్కోన్నారు.