కరువు చర్యలు చేపట్టాలి

19-11-2026 | 08:14pm

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య డిమాండ్.

ములకలపల్లి,నవంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం(State Government) కరువు మండలాలుగా ప్రకటించిన మండలాలకు తక్షణమే బడ్జెట్ కేటాయించి రైతులకి అందించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు(CPM State Committee Members) అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలోని ఎల్ నీనో ప్రభావంతో రైతులు పంటలు సాగులోకి రాక సాగు చేసిన పంటలు సగంలోనే ఎండిపోయి రైతులు నష్టపోయి ఆవేదన చెందుతున్నారని అన్నారు.ప్రభుత్వం ఎల్ నీనో వల్ల రాష్ట్రంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందని,కరువు మండలాలుగా ప్రకటించిన మండలాలకు కరువు చర్యలు నేటికీ చేపట్టకపోవడం బాధాకరమైన విషయమని అన్నారు.

ఎల్ నీనో కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే అందుకోవాలని డిమాండ్ చేశారు.తుపాను కారణంగా సాగులో ఉన్న పంటలు కొట్టుకుపోయి నష్టపోయిన రైతాంగాన్ని నష్టపోయిన పంటకు అంచనా వేసి నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

మండలంలోని తుఫాను కారణంగా కొట్టుకుపోయిన రహదారులను అదేవిధంగా వీధి రోడ్లను తక్షణమే మరమ్మతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.రైతులందరికీ తక్షణమే బ్యాంకు రుణాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.రైతులందరికీ 24 గంటల విద్యుత్ సౌకర్యం కల్పించాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య, పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పోడియం వెంకటేశ్వర్లు, ఊకంటి రవికుమార్, గౌరీ నాగేశ్వరరావు, మాలోతు రావుజ, నిమ్మల మధు, కుంజా రామ్మూర్తి, కీసరి వెంకట్రావు, గడ్డం వెంకటేశ్వర్లు, గోపగాని లక్ష్మీ నరసయ్య, బైరు ప్రసాద్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు