ఉద్యోగుల సమస్యల పరిష్కారమే టీఎన్జీవో లక్ష్యం

19-11-2026 | 08:13pm

రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుతాం: గడియారం శ్రీహరి

మంచిర్యాల,(విజయక్రాంతి): టీఎన్జీవో సంఘం బలోపేతానికి మంచిర్యాల జిల్లా(Mancherial District)లో వేగంగా అడుగులు పడుతున్నాయి. జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మంచిర్యాల అటవీ శాఖ కార్యాలయంలో నిర్వహించిన సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో 43 మంది నాన్‌ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవో సభ్యత్వం(TNGVO Membership) స్వీకరించారు.

ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే టీఎన్జీవో సంఘం ప్రధాన లక్ష్యమని, జిల్లాలోని మిగిలిన అన్ని యూనిట్లలోనూ సభ్యత్వ నమోదును త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెడతామని స్పష్టం చేశారు. ఉద్యోగుల ఐక్యతతో మంచిర్యాల జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, ఉపాధ్యక్షుడు ప్రకాష్‌తో పాటు అటవీ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు