శాంతి భద్రతల పరిరక్షణ కు ప్రతి ఒక్కరి సహకరించాలి
బోథ్. నవంబర్ 16 (విజయ క్రాంతి.) శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని స్థానిక సీఐ సాయినాథ్(CI Sainath) పేర్కొన్నారు. సోమవారం నూతనంగా విధులలోకి చేరిన సిఐని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress Leaders) మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మెరుగు భోజన్న ఆధ్వర్యంలో కలిసారు.
ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బోథ్ బ్లాక్ ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ ఈపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపధ్యక్షులు కుర్మే మహేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అచ్చితానంద రెడ్డి, మండల ఉపాధ్యక్షులు కౌసర్, ప్రధాన కార్యదర్శి అబూద్, నాయకులు విజయ రాజారెడ్డి, వార్డు సభ్యులు షేక్ షాకీర్ పద్మారావు ఆత్మ డైరెక్టర్ రహీముద్దీన్, మాజీ ఎంపిటిసి షేక్, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ బొజ్జ సాయన్న, అబ్రార్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.