ఘనంగా బాలల దినోత్సవం

14-11-2026 | 11:59pm

మణుగూరు,నవంబర్ 14, (విజయక్రాంతి ): పురస్కరించుకొని సుందరయ్య నగర్ లోని బ్రైట్ మైండ్స్ ప్లే స్కూల్లో(Bright Minds Play School) బాలల దినోత్సవం(Childrens Day) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంతకుముందు నిర్వహించిన డ్రాయింగ్, డాన్స్, ఒకాబులరీ వంటి పోటీలలో గెలుపొందిన చిన్నారులకు కరస్పాండెంట్ రమ, రాంబాబులు మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నేటి బాలలే రేపటి పౌరులని పిల్లల పట్ల చిన్ననాటి నుండే తల్లిదండ్రులు క్రమశిక్షణ అలవర్చి సమాజానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

ఉపాధ్యాయులుగా మా బాధ్యత విద్యార్థుల ఎదుగుదల తీర్చిదిద్దడంలో ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు అందరీని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గ్రీష్మ,  అలేఖ్య, జ్యోతిక, హరిత, సామ్రాజ్యం తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు