ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నరసన్న పటేల్
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్
కొత్తపల్లి, నవంబర్ 14(విజయక్రాంతి): రైతులకు(Farmers') ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్(Akula Narasanna Patel) అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం లోని ఎలబోతారం, ఫకీర్పేట్, బహదూర్ ఖాన్పేట్, దుబ్బిపల్లి, తహెర్ కొండాపూర్ గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను(IKP grain purchasing centers) కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా నర్సన్న పటేల్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని, కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, డైరెక్టర్లు మీసాల శంకర్, సంపత్, కనకయ్య, ఎలబోతారం సర్పంచ్ తప్పట్ల రాజు, ఫకీర్పేట్ సర్పంచ్ విజయలక్ష్మి లక్ష్మణ్, బహదూర్ ఖాన్పేట్ సర్పంచ్ గుర్రం సంధ్య తిరుపతిరెడ్డి, తహెర్ కొండాపూర్ సర్పంచ్ ఆకుల గిరి, దుబ్బిపల్లి సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి, చెల్లబూత్కూర్కు చెందిన కర్ర నరేష్ రెడ్డి, ఉపసర్పంచులు , ఏటీఎం రామ్మోహన్, గ్రామ ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు, ఐకేపీ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.