హెచ్ఎం సస్పెన్షన్ ఎత్తివేతలో.. విద్యాశాఖ విచిత్రం!

14-11-2026 | 11:56pm

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖలో ఓ ఉపాధ్యాయుని సస్పెన్షన్..

పునర్నియామకాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన వైనం 

ఇల్లెందు, (విజయక్రాంతి): విద్యాశాఖలో(Department of Education) ఉపాధ్యాయుల సస్పెన్షన్(Suspension of teachers), పునర్నియామకాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రధానోపాధ్యాయుడిని ఈ నెల 5వ తేదీన విధుల నుంచి సస్పెండ్ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు(District Educational Department Officials) కేవలం 9 రోజుల్లోనే తిరిగి విధుల్లోకి తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అదీ మారుమూల గ్రామీణ ప్రాంతంలోని పాఠశాల నుంచి ఇల్లందు పట్టణంలోని తన నివాసానికి సమీపంలో ఉన్న పాఠశాలకు కేటాయించడం వెనుక అధికారుల అంతర్యమేమిటనే ప్రశ్నలు ఉపాధ్యాయ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాల్సిన ఉన్నతాధికారులపై ఉంది.

బాధ్యత విద్యాశాఖ నివేదికలు

ఐదుగురు బుట్టదాఖలా? అధికారుల

ఇల్లందు మండలం(Yellandu Mandal) మర్రిగూడెం (ఎం) ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న డి. రమేష్పై గత రెండేళ్లుగా పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నట్లు తెలుస్తోంది. అటెండెన్స్ రిజిస్టర్లలో అవకతవకలు, అర్హతలేని సెలవులకు పూర్తి వేతనం చెల్లించాలని అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, గ్రామస్తుల నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

పాఠశాల నిర్వహణలోనూ, హాజరు రికార్డుల నిర్వహణలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఐదుగురు అధికారులు ఆధారాలతో సహా జిల్లా విద్యాశాఖకు నివేదికలు సమర్పించినట్లు సమాచారం. ఇంతటి ఆరోపణలు ఉన్నప్పటికీ సుదీర్ఘకాలం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, చివరకు సస్పెండ్ చేసిన ఎనిమిది రోజులకే తిరిగి విధుల్లోకి తీసుకోవడం విద్యాశాఖ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

మర్రిగూడెం నుంచి సంజయ్ నగర్కు ఎలా?

ప్రధానోపాధ్యాయుడు మర్రిగూడెం పాఠశాలలో సుమారు ఎనిమిదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇల్లందు మండల కేంద్రానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పాఠశాల నుంచి ఇల్లందు పట్టణంలోని ఎం.పి.పి.ఎస్ సంజయ్ నగర్ పాఠశాలకు పునర్నియామకం కల్పించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది సస్పెన్షన్ అనంతరం సాధారణంగా అనుసరించే పరిపాలనా విధానాలు, ఆరోపణల తీవ్రత, విచారణ పురోగతి వంటి అంశాలను తీసుకున్నారా? లేక వ్యక్తిగత పరిగణనలోకి సౌలభ్యానికి ప్రాధాన్యత ఇచ్చారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వచ్చే మే నెలలో సాధారణ బదిలీలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, పట్టణ ప్రాంతానికి చేరుకోవడం వెనుక ప్రత్యేక ప్రయోజనాలున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సస్పెన్షన్ శిక్షనా.. స్థానచలనం కోసం అవకాశమా?

గతంలో గుండాల మండలంలోని మారుమూల గ్రామంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో సదరు ఉపాధ్యాయుడిపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు రావడంతో సస్పెండ్ అయినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అనంతరం ఇల్లందు మండలానికి రావడం, ఇప్పుడు మరోసారి సస్పెన్షన్కు గురై కొద్ది రోజుల్లోనే పట్టణంలోని పాఠశాలకు కేటాయించబడటం పలు అనుమానాలకు కారణమవుతోంది. గతంలోనూ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రిజిస్టర్ల అవకతవకలపై క్రిమినల్ చర్యలేవీ?

అటెండెన్స్ రిజిస్టర్లను ఫ్యాబ్రికేట్ చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ పునర్నియామక ఉత్తర్వుల్లో ఆ అంశాలపై ఎలాంటి స్పష్టత లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రికార్డుల తారుమారు జరిగిందనే ఆరోపణలు ఉన్నప్పుడు వాటిపై శాఖాపరమైన విచారణతో పాటు అవసరమైతే పోలీసు విచారణ ఎందుకు చేపట్టలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరోపణల తీవ్రతను పక్కనపెట్టి సస్పెన్షన్ ఎత్తివేతకు అధికారులు ఎందుకు తొందరపడ్డారో ఉన్నతాధికారులు వెల్లడించాల్సిన అవసరం ఉంది.

రాష్ట్రస్థాయి విచారణకు సంఘాల డిమాండ్ ఉపాధ్యాయ

జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న ఈ పరిణామాలు పారదర్శక పరిపాలనకు విరుద్ధంగా ఉన్నాయంటూ ఉపాధ్యాయ వ్యక్తం సంఘాలు ఆగ్రహం చేస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఎనిమిది రోజుల్లోనే పునర్నియామకం కల్పించడం, అందులోనూ నివాసానికి సమీపంలోని పాఠశాలకు కేటాయించడం వెనుక ఎలాంటి సిఫార్సులు, ఒత్తిళ్లు లేదా ఆర్థిక లావాదేవీలు చోటుచేసుకున్నాయనే అంశాలపై నిష్పక్షపాత విచారణ జరగాలని కోరుతున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తక్షణమే స్పందించి సస్పెన్షన్ ఉత్తర్వులు, పునర్నియామక ఉత్తర్వు…

మరిన్ని వార్తలు