గూడెంలో కార్తీక పూజలు

16-11-2026 | 06:01pm

దండేపల్లి, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్య నారాయణ స్వామి ఆలయంలో (Gudem Sri Satyanarayana Swamy Temple) కార్తీక మాసం మొదటి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో కార్తీక పూజలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లాతో పాటు పక్క జిల్లాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ఆలయ సమీపాన గల గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి ఆలయ ముఖ ద్వారం వద్ద గల రాగీ చెట్టు వద్ద పెద్ద మొత్తంలో భక్తులు దీపారాధన చేశారు. అనంతరం గుట్ట పైన ఉన్న సత్యదేవుడిని దర్శించుకున్నారు

మరిన్ని వార్తలు