మూడు ప్రశ్నల గిజూబాయి!
విద్యారంగంలో అత్యంత ప్రధానమైన మూడు ప్రశ్నలు.. ఏం నేర్పించాలి? ఎందుకు నేర్పించాలి? ఎలా నేర్పించాలి? వీటి పరిష్కారం పైనే విద్య ప్రయోజకత్వం(The Utility of Education) ఆధారపడి వుంది. ఈ మూడింటిని చర్చగా సమన్వయ పరచినపుడే ఫలితాలు మంచివిగా మనకందగలవు. ఏమి నేర్పించాలి? ఎందుకు నేర్పించాలి? ఈ రెండూ వ్యక్తి అవసరాలు, సమాజ అవసరాలు, దేశ అవసరాలపై ఆధారపడి వుంటాయి.
ఈ అవసరాలు కూడా తాత్కాలికమైనవి, శాశ్వతమైనవిగాను వుంటాయి. అందువల్ల మనం నేర్పించదలచుకున్న దాని పద్ధతి మారుతూ వుంటుంది. ఈ కారణం చేతే విద్యా ప్రణాళిక కూడా ఎల్లప్పు డూ మారుతూనే వుంటుంది. అం దుకు విద్యావేత్తలు, మేధా వులు నిరంతరం ప్రయత్నిస్తూ వుం టారు. ఇలాంటి భావాలకు మొదట రూపకల్పన చేసినవారు ‘గిజూబాయి గారు’. నవంబర్ 15, 1885న జన్మించారు. విద్యార్థులకు, ఉపాధ్యాయు లకు ఉపయోగపడేవిధంగా తన అనుభవాలను ఉపయో గించి విద్యార్థులతో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలనే విషయాల్ని తెలు పుతూ అమలు చేసి ఆదర్శంగా నిలిచిన గిజూబాయి జూన్ 23, 1939న మరణించారు.
సులభమైన భాషలో యధార్థ విద్యాపరిస్థితులను విశ్లేషించడంలో గిజూబాయికి సాటి ఎవరూ లేరు. పిల్లల వికాసాన్ని దగ్గరగా వుండి చూడ డానికి, సూక్ష్మంగా ఆలోచించడానికి తాను అనుకున్న విద్యా విలువలు నిరూపించటానికి ఆయన భావనగర్‌లో ఒక ప్రయోగశాల రూపంలో ‘దక్షిణామూర్తి బాలమందిరం’ స్థాపించారు. పిల్లల అవసరాలు, వారి అభి రుచులు, శక్తిసామర్థ్యాలు మున్నగువాటిని గమనంలో పుంచుకుని అనేక ప్రయోగాలు చేశారు.
తదనంతరం వాటినన్నిటి సారాన్ని ‘నూతన శిక్షణ’ రూపంలో మనకందించారు. గుజరా లో పిల్లల మనోహరమైన శిక్షణా సంస్థ స్థాపించి నవీన బోధనకు శ్రీకారం చుట్టారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడేలా 17 ఉత్తమ పుస్తకాలను రచించారు. వీటి లో బాల మనస్తత్వశాస్త్రం, వారి పెంపకం, వారి శిక్షణ, ప్రేమపూర్వ కంగా వాత్సల్యంతో నిండి ఎలా చేయాలో మనకు ప్రబోధించారు.
గిజూబాయి రచించిన పుస్తకాలలో ’మాంటిసోరి పద్ధతి’, ’పగటికల’, ‘కథా బోధనా పద్ధతి’ అత్యంత విలక్షణమైనవి. విద్యారంగంలో ఈ మూడు వుస్తకాలు చాలా మౌలికమైనవి, బాలల జీవితాలను లోతుగా అధ్యయనం చేయడానికి ఎంతగానో దోహదపడుచున్నాయి.
గిజూభాయి ఐరేకా.
సాధారణంగా మనస్తత్వ శాస్త్ర సిద్ధాంతాల ఆధారంగానే బోధనా పద్ధతి నిర్ణయింపబడుతూవుంటుంది. అయితే మొత్తంగానే మనస్తత్వ శాస్త్రాన్ని అనుసరించే బోధనా పద్ధతి వుండదు. వ్యక్తిగత భావాలు కూడా నిండి వుంటాయి. కనుక మనస్తత్వశాస్త్రం, వ్యక్తిగత వికాసం ఈ రెండింటి సమ న్వయంలోనే బోధనా పద్ధతికి పునాది పడుతుంది. ఇళ్ళల్లో తల్లి పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతుంది.
అందువల్ల ఆమే వాళ్లకు అత్యంత సన్నిహితురాలు. వారిని అర్ధం చేసుకోవడానికి ఓర్పు, నేర్పు, శక్తి సామర్థ్యాలు ఆమెలోనే ఎక్కువగా వుంటాయి. స్వర్గీయ గిజూబాయి గారు కూడా తల్లి లాంటి సూక్ష్మ దృష్టితో, మమత నిండిన కళ్ళతో పిల్లలను చూచారు. వారి వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా వికసింపజేసే ప్రయ త్నం చేశారు. విద్యకు సంబంధించిన సిద్ధాంతాలు, బోధనా పద్ధతు లను అర్ధం చేసుకోవాలంటే గిజూబా యి రచనలు చ దవడం అత్యవసరం.
అవన్నీ ఒక అనుభవం నిండిన ఉపాధ్యాయుడి అనుభవాల నుంచి వెలు వడ్డాయి. కావునా వారి రచనలు నేటి తరం ఉపాధ్యాయులు చదివి విద్యార్థితో ఎలా మసలుకో వాలో తెలుసు కొని, వారిని ఉత్తములుగా తయారు చేస్తారని ఆశిద్దాం.
వ్యాసకర్త సెల్: 9963499282