సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం తూట్లు

15-11-2026 | 05:15am
  1. భారత్ సమ్మిట్ వేదికలో వక్తల ధ్వజం
  2. నిధుల కోతతో రాష్ట్రాల హక్కులకు విఘాతం
  3. డీలిమిటేషన్‌తో దక్షిణాది ప్రాధాన్యతకు గండి
  4. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

నవంబర్ 14 (విజయక్రాంతి) : దేశ రాజ్యాంగ మౌలిక(fundamental countrys constitution) సూత్రమైన సహకార సమాఖ్య (కో-ఆపరేటివ్ ఫెడరలిజం) విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కాలరా స్తున్నదని భారత్ సమ్మిట్ వేదికలో(India Summit Venue) పలువురు నేతలు, మేధావులు ధ్వజమెత్తారు. ని ధుల కేటాయింపులో వివక్ష, గవర్నర్ల ద్వారా  బిల్లుల తొక్కివేత, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వంటి చర్యలు రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి ప్రమాదంగా మారాయని ఆందో ళన వ్యక్తం చేశారు.

శనివారం ‘భారత్ సమ్మి ట్’ వేదికలో ‘తెలంగాణ అభ్యుదయం - సహకార సమాఖ్య పాలన’ అంశంపై చర్చాగోష్ఠి కొనసాగింది. కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సమన్వయకర్త (మోడరేటర్)గా వ్యవహరించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ వరి, మొక్కజొన్న వంటి పంటలకు కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు చేయకుండా చేతులు దులుపుకుంటోందని, ఫలి తంగా ఆ భారం రాష్ట్రాలపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్రం నుంచి  నిధులు సక్రమంగా రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకు లు, బహిరంగ మార్కెట్ నుంచి భారీగా అప్పులు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. చట్టబద్దంగా అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు తొక్కిపెడితే రాష్ట్రాలకు దిక్కె వరు? అని ప్రశ్నించారు. తమిళనాడు గవర్నర్ వ్య వహారంలో సుప్రీంకోర్టు గడువు విధిస్తూ ఇచ్చిన తీర్పును ఆ తర్వాత వెనక్కి తీసుకోవడం సమాఖ్య వ్యవస్థకు తీవ్ర ముప్పుగా పరిణమించిందని అస హనం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ పేరుతో లోక్‌సభ స్థానాలను 542 నుంచి 840కి పెంచితే పార్లమెంటులో దక్షిణాది ప్రాధాన్యం తగ్గు తుందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

గిరిజన హక్కులకు భంగం: జార్ఖండ్ మంత్రి శిల్పి నేహా

ఝార్ఖండ్ మంత్రి శిల్పి నేహా టిర్కీ మాట్లాడుతూ తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభు త్వం రూ.1.36 లక్షల కోట్ల బొగ్గు రాయల్టీ బకాయి పడిందని తెలిపారు. ఎంఎండీఆర్ చట్ట సవరణ ద్వారా బొగ్గు గనులపై కేంద్ర మే నేరుగా పన్నులు విధించేలా మా ర్పులు చేయడం వల్ల జార్ఖండ్‌కు ఏటా రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లుతోందని చెప్పారు.   పీసా చట్టం ద్వారా గిరిజన గ్రామ సభలకు దక్కిన అధికారాలను నేడు ఒడిశాలోని నియంగిరి, ఛత్తీస్‌గఢ్‌లోని హస్దేవ్ అడవుల విషయంలో కాలరాస్తున్నారని విమర్శించారు.

సమాఖ్యకు సుప్రీంకోర్టే రక్ష : ప్రొఫెసర్ గణేష్ దేవీ

ప్రముఖ సామాజికవేత్త, రచయిత ప్రొఫెసర్ గణేష్ దేవీ మాట్లాడుతూ అంబేడ్కర్, నెహ్రూల దార్శనికతతో రూపుదిద్దుకున్న భారత సమాఖ్య వ్యవస్థ నేడు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల ఆదాయ వనరులను కేంద్రం కట్టడి చేస్తోందని, రాష్ట్ర జాబితాలోని ప్రాథమిక విద్య,  ప రీక్షల నిర్వహణలోనూ జోక్యం చేసుకుంటోందని విమర్శించారు. ఈ విషయంలో తెలంగాణ విద్యా విధానం ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు.   

వ్యవస్థ కు సుప్రీంకోర్టే రక్షగా నిలుస్తుందన్నారు. ఒకే దేశం - ఒకే ఎన్నిక’ వంటి అంశాలు తెరపైకి వచ్చినప్పుడే న్యాయస్థానాలు జోక్యం చేసుకుని అడ్డుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. లోక్‌సభ స్థానాలు పెంచడం కంటే రాజ్యసభను బలోపేతం చేసే దిశ గా సంస్కరణలు ఉండాలని సూచించారు.

‘కిల్ స్విచ్’లతో ఎన్నికల వ్యవస్థలో కేంద్రీకరణ: ఆదిత్య మెహతా

విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆదిత్య మెహ తా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ రాష్ట్రా ల పరిధిలోని అంశమైనప్పటికీ, సాంకేతికత పేరుతో కేంద్రం చేతిలో కిల్ స్విచ్’ ఉండేలా వ్యవస్థలను మార్చడం సమాఖ్య వ్యవస్థను బలహీనపరచడమేనని వ్యాఖ్యానించారు. అలాగే పంచాయతీరాజ్ సంస్థలకు నిధులు, విధులు బదిలీ చేయడంలో రాష్ట్రాలు వెనుకాడుతున్నాయన్నారు.

రాజకీయ వివక్షతోనే నిధుల కోత: ఎంపీ చామల, మధుయాష్కీగౌడ్ 

ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ‘వికసిత్ భారత్, తెలంగాణ 2047’ లక్ష్యాలు నెరవేరాలంటే కేంద్ర, -రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమన్నారు. కేం ద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా లేని రాష్ట్రాలపై నిధులు, జలాల పంపి ణీలో వివక్ష చూపడం తగదన్నారు.

సమన్వయకర్త మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ అమెరికా వంటి అగ్రరాజ్యం మహిళలకు ఓటు హక్కు ఇవ్వడానికి 144 ఏళ్లు తీసుకుంటే, అంబేద్కర్ రాజ్యాంగం తొ లి రోజు నుంచే దేశంలో అందరికీ సమాన ఓటు హక్కు కల్పించిందని గుర్తుచేశారు. 

మరిన్ని వార్తలు