ప్రజావాణి అర్జీలను వారంలోగా పరిష్కరించాలి

16-11-2026 | 05:46pm

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి, నవంబర్ 16 (విజయక్రాంతి): ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను జాప్యం లేకుండా పరిశీలించి, వారంలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 85 అర్జీలు స్వీకరించారు.

ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖలకు వెంటనే పంపించి, తీసుకున్న చర్యలను ప్రజావాణి పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డీఆర్‌ఓ వసంతకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు