గుడంబస్తవరాలపై పోలీసులు మెరుపు దాడి

19-11-2026 | 07:23pm

మహా ముత్తారం నవంబర్ 19 (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవిముత్తారం పోలీస్ స్టేషన్(Adavimuttaram Police Station) ఎస్ఐ జి. రమేష్ ఆధ్వర్యంలో గురువారం పోలీస్ సివిల్ మరియు టీజీఎస్పీ సిబ్బంది సంయుక్తంగా పోచంపల్లి గ్రామంలో గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసులు  దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో 35 లీటర్ల గుడుంబా మరియు 400 లీటర్ల తెల్ల పానకం స్వాధీనం చేసుకోవడంతో పాటు, 400 లీటర్ల తెల్ల పానకాన్ని అక్కడికక్కడే ధ్వంసం చేయడం జరిగింది.

ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటనకు సంబంధించి పోచంపల్లి గ్రామానికి చెందిన హాట్కర్ రవీంద్ర, హాట్కర్ అనూష, నునావత్ రాజు, శ్రీకాంత్ మరియు హాట్కర్ సుగుణ అను వారి పైన కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీ జి. రమేష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.అదేవిధంగా, గ్రామంలో ఎవరైనా గుడుంబా తయారీ, విక్రయాలు, పేకాట  వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

మరిన్ని వార్తలు