అన్నదాన కార్యక్రమం ప్రారంభం

16-11-2026 | 09:38pm

మహబూబాబాద్ (విజయక్రాంతి): అయ్యప్ప మాలధారణ(Ayyappa Mala Dharana) చేసి మండల దీక్ష చేపట్టిన భక్తులకు సేవ చేయాలనే సంకల్పంతో కేసముద్రం పట్టణంలోని శ్రీ ధర్మశాస్త ఆలయంలో(Sri Dharmasasta Temple) 41 రోజుల పాటు నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమాన్ని సోమవారం కేసముద్రం మున్సిపల్ చైర్‌ పర్సన్ బానోత్ సునీత వెంకన్న, వైస్ చైర్ పర్సన్ అల్లం రామ నాగేశ్వర్ రావు ప్రారంభించారు.

ఈ సందర్బంగా అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వాములకు అన్నదానం చేయడం ఎంతో పుణ్యప్రదమైన సేవ అని, భక్తిశ్రద్ధలతో మండల దీక్ష చేపట్టిన స్వాములకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, అన్నదాన సేవ సొసైటీ ప్రతినిధులు, అయ్యప్ప స్వామి భక్తులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు