సిర్గాపూర్ లో ప్రజావాణిలో దరఖాస్తులు రాక వెలవెల

16-11-2026 | 09:45pm

సిర్గాపూర్ నవంబర్ 16(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో(Sirgapur Mandal Parishad Office, District) సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరైనప్పటికీ, ప్రజల నుంచి ఒక్క దరఖాస్తు కూడా రాలేదని ఎంపీడీవో ఆండాలమ్మ తెలిపారు.

మండల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని సద్వినియోగించుకోవాలని ఎంపీడీఓ సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్  నాగారం శ్రీనివాస్, వెటర్నరీ డాక్టర్ జెస్సి, ఎంపీవో బ్రహ్మయ్య, సీఆర్పీ శివ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు