పాఠశాలలో మౌలిక వసతులపై ఆరా

16-11-2026 | 07:16pm

తాడ్వాయి,నవంబర్,16( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి ప్రాథమిక పాఠశాలలో(Krishnajiwadi Primary School) ఎఫ్ ఎల్ ఎన్ సభ్యులు లాల్ సింగ్ మౌలిక వసతులపై ఆరా తీశారు.ఆయన సోమవారం పాఠశాలలో వసతులు,విద్యార్థుల హాజరు,ఉపాధ్యాయుల హాజరు పనితీరు విషయాలపై చర్చించారు.పాఠశాలలో అన్ని మౌలిక వసతులు ఉన్నాయా అనే విషయమై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

ఉపాధ్యాయులు పాఠశాలకు సక్రమంగా వస్తున్నారా లేదా విద్యార్థుల హాజరు శాతం ఎలా ఉంది అనే విషయాలపై ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు పాఠశాలలో సక్రమంగా విధులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు అందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామస్వామి, ప్రధానోపాధ్యాయులు రంజిత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు