నూతన డైరెక్టర్లకు ఘన సన్మానం
16-11-2026 | 05:41pm
భిక్కనూర్, నవంబర్ 16 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి(Peddamallareddy Primary Agricultural Cooperative Society) నూతనంగా ఎన్నికైన కంచర్ల గ్రామానికి చెందిన డైరెక్టర్లు పెంటల నర్సాగౌడ్, పెంజర్ల శేఖర్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు.
సర్పంచ్ అరుణ స్వామి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు తిరుమల్ గౌడ్, నవీన్, సిద్ధరాములు శాలువాలు, పూలబొకేలతో అభినందించారు. ఈ సందర్భంగా నూతన డైరెక్టర్లు మాట్లాడుతూ గ్రామ రైతులకు అందుబాటులో ఉంటూ సహకార సంఘం ద్వారా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.