ఎస్సై ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆలయ ఫౌండేషన్ సభ్యులు

16-11-2026 | 05:53pm

వేమనపల్లి, ( విజయక్రాంతి ) మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నిల్వాయి పోలీస్ స్టేషన్‌లో (Nilvai Police Station) ఎస్సై నాగరాజును (SI Nagaraju) ఆలయ ఫౌండేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సై నాగరాజుతో ఆత్మీయంగా మాట్లాడి సాల్వతో సన్మానించి, హెల్త్ క్యాంపు, ఐ క్యాంపు గురించి చర్చించడం జరిగింది .

పోలీస్ శాఖ అందిస్తున్న సేవలను అభినందిస్తూ, ప్రజలకు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పరస్పర సహకారం అందించాలని ఆకాంక్షించారు. ఈ మర్యాదపూర్వక సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ అడిషనల్ సీఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్, రసపెల్లి రవికుమార్, అలమర్తి శిరీష్, కమటం కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు