ఏడుపాయల టు ఎర్రవల్లి..

16-11-2026 | 05:53pm

* ఏడుపాయల నుంచి ఎర్రవల్లికి బీఆర్ఎస్ నేతల పాదయాత్ర

* కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని వనదుర్గమ్మకు ప్రత్యేక పూజలు

పాపన్నపేట, నవంబర్16: తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ సోమవారం బీఆర్ఎస్ నాయకులు(BRS leaders) ఏడుపాయల నుంచి ఎర్రవల్లికి పాదయాత్ర చేపట్టారు. కల్వకుంట సర్పంచ్ అందె కొండల్ రెడ్డి, శంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో యాత్ర ప్రారంభమైంది. ముందుగా ఏడుపాయల వనదుర్గమ్మను దర్శించుకుని కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని కేసీఆర్‌కు అందజేసేందుకు ఎర్రవల్లికి పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, తెలంగాణలో బీఆర్ఎస్ పాలన రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ బాలాగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, సర్పంచ్ కనకరాజు, నవీన్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు