ప్రజావాణిలో 106 ఫిర్యాదులు
16-11-2026 | 05:45pm
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, నవంబర్ 16 (విజయక్రాంతి): కామారెడ్డి కలెక్టరేట్లో(Kamareddy Collectorate) సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి 106 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ ఆశిష్ సంగువాన్(Collector Ashish Sangwan) తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే ఆయా శాఖల అధికారులు పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్ ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి చందర్, డిఆర్ఓ పాండు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.