కవిత కు ఘన స్వాగతం పలికిన టిఆర్ఎస్ నాయకులు

16-11-2026 | 07:42pm

భిక్నూర్ టోల్గేట్ వద్ద ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం 

కామారెడ్డి, నవంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) చీఫ్ కవితక్క నిజామాబాద్ వెళ్తున్న తరుణం లో సోమవారం తెలంగాణ రక్షణ సేన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి  ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో కవితక్కని భిక్నూర్ టోల్గేట్ వద్ద కలిసి పుష్ప గుచ్చాము అందజేశారు. ఈ సందర్బంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ సంపత్ గౌడ్ మాట్లాడుతూ కవిత క్కతోనే తెలంగాణ లో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ లో టి ఆర్ ఎస్ జెండా ఎగురవేయడం కాయమన్నారు. 

అంతకు ముందు కవితక్క కు పుష్ప గుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం లో సదాశివనగర్ టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు కలాలి సాయగౌడ్, లింగంపేట్ మండల అధ్యక్షుడు సాయిరాం,

జిల్లా యూత్ అధ్యక్షుడు జైల్ సింగ్, గాంధారి మండల అధ్యక్షులు కృష్ణ మూర్తి, మోసర్ల శ్రీకాంత్ రెడ్డి, తాడ్వాయి సీనియర్ నాయకులు సంతోష్, సదాశివనగర్ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు శివ, రాము, వినోద్, టి ఆర్ ఎస్ సదాశివనగర్ మహిళ అధ్యక్షురాలు సంధ్య, రామారెడ్డి మహిళ అధ్యక్షురాలు లత, గాంధారి మహిళా అధ్యక్షురాలు సునీత, లింగంపేట్ మహిళ అధ్యక్షురాలు సావిత్రి,  వడ్ల లత,కుమ్మరి గంగమణి,  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు