రామగిరి విద్యుత్ ఇన్చార్జి ఏఈగా సంతోష్ రెడ్డి
రామగిరి, నవంబర్ 16 విజయక్రాంతి) మండల విద్యుత్ శాఖ(Electricity Department) ఇన్చార్జి అసిస్టెంట్ ఇంజనీర్‌గా కే. సంతోష్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రత్నాపూర్ సబ్‌స్టేషన్‌లోని విద్యుత్ కార్యాలయంలో(Electricity Office) మంథని విద్యుత్ డీఈ వి. ప్రభాకర్ సమక్షంలో ఆయన విధుల్లో చేరారు.
ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు(Electricity Services) అందిస్తూ, విధుల పట్ల అలసత్వం ప్రదర్శించకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అనంతరం విద్యుత్ సిబ్బంది డీఈ ప్రభాకర్, ఇన్చార్జి ఏఈ సంతోష్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.
సబ్‌స్టేషన్‌లో సెల్‌ఫోన్ ఏర్పాటు చేయాలి
రత్నాపూర్ సబ్‌స్టేషన్‌లో సెల్‌ఫోన్ ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు విద్యుత్ డీఈ ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేశారు. సబ్‌స్టేషన్‌కు ఫోన్ సౌకర్యం లేకపోవడంతో విద్యుత్ వినియోగదారులు అత్యవసర సమయాల్లో సిబ్బందిని సంప్రదించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. దీనిపై స్పందించిన డీఈ త్వరలోనే సెల్‌ఫోన్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ముత్తారం ఏఈ రాజేందర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ మౌలానా, లైన్ ఇన్స్పెక్టర్లు ఉడుత భూమయ్య, నవీన్, లైన్మెన్లు బండారు శివకుమార్, రాజేందర్, ఆకుల శ్రీనివాస్, రమేష్, ఏఎల్ఎంలు ఈశ్వర్, రాజు, కృష్ణమాచారి, బండి శ్రీనివాస్, రాకేష్, కాంట్రాక్టర్లు గుండ రాదయ్య, చందన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.