సీసీ రోడ్డు పనులపై గ్రామస్థుల ఆందోళన

16-11-2026 | 07:39pm

ప్రజాధనం వృథా కాకుండా చూడాలి

ప్రజావాణిలో బీఆర్ఎస్ నాయకుల వినతి                    

భూపాలపల్లి/రేగొండ, నవంబర్ 16 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పెద్దంపల్లి గ్రామంలో ఇటీవల చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని గ్రామస్థులు ఆరోపించారు. రోడ్డు నిర్మాణం పూర్తయిన కొద్ది రోజులకే దెబ్బతినడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పసుల రత్నాకర్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్(Additional Collector Ashok Kumar)కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల్లో జరిగిన నాణ్యత లోపాలపై సమగ్ర విచారణ చేపట్టాలని, సంబంధిత కాంట్రాక్టర్ పనితీరును పరిశీలించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే దెబ్బతిన్న రోడ్డును పరిశీలించి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, పెద్దంపల్లి గ్రామ ఉపసర్పంచ్ సకినాల రవీందర్, 8వ వార్డు సభ్యుడు అంబటి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు