ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీ
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ మినీ నందన గార్డెన్ లో ముస్లింల అభ్యున్నతికి, రక్షణకు పలువురు ముస్లింల సమక్షంలో ‘ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్(Muslim Welfare Association Committee)' జిల్లాస్థాయి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ జిల్లా అధ్యక్షులుగా రిటైర్డ్ జిల్లా అధికారి సయ్యద్ ఖుర్షిద్, ప్రధాన కార్యదర్శిగా నదీమ్ ఇంతియాజ్ అలీ ఖాన్, ఉపాధ్యక్షులుగా చాంద్ పాషా, ఫజల్, షేఖ్ బాబా, అస్గర్ , జాయింట్ సెక్రెటరీలుగా మహబూబ్ పాషా, యాఖుబ్ పాషా, షర్ఫుద్దీన్, జానీ మియా, కోశాధికారిగా ఖాజా షబ్బీర్ అహ్మద్ లను, సలహాదారులుగా షేఖ్ యాఖుబ్ అలీ, ఇమాముద్దీన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ముఫ్తీ అలంగీర్, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు తెలంగాణ ముస్లిం జే.ఏ.సీ. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ముస్లింలు ఇస్లాం పద్ధతులను పూర్తిస్థాయిలో ఆచరించాలని, పేదవారికి, నిస్సయులకు సహాయం చేయడంలో ముస్లింలు ముందుండాలని, యువత సన్మార్గంలో నడిచి, తల్లిదండ్రులకు ముస్లిం సమాజానికి మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ నయీమ్, హారుణ్, ముబీన్, నజీర్, యూసుఫ్, ఉస్మాన్, షేఖ్ మహమ్మద్, శంషుద్దీన్, సయ్యద్ అహ్మద్, షేక్ సాదిఖ్, అతిఖ్, ముజఫర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.