19వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ళకు శంకుస్థాపన
కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి
కోదాడ నవంబర్ 16(విజయ క్రాంతి): మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి , కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి(Kodad MLA Padmavathi Reddy) 19వ వార్డుకు 11 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించగా, సోమవారం కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు హాజరై మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో 28వ వార్డు కౌన్సిలర్ తోట జ్యోతి శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ డైరెక్టర్ తమనబోయిన వీరబాబు పబ్లిక్ క్లబ్ ప్రధాన కార్యదర్శి, పోటు రంగారావు మాజీ కౌన్సిలర్ ప్రసన్నలక్ష్మి పంతంగి నరేష్ పంతంగి నారాయణ కలగొట్ల బ్రహ్మారెడ్డి కాటేపల్లి ప్రసాద్ పాల్గొన్నారు.