ఇందిరమ్మకు ఘనంగా నివాళులు

19-11-2026 | 07:26pm

రాజాపూర్ నవంబర్ 19: భారత మాజీ దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ(Prime Minister Indira Gandhi) జయంతి వేడుకలు గురువారం మండల కేంద్రంతో పాటు తిరుమలాపూర్ రంగారెడ్డి గూడా ఖానాపూర్ చెన్న వెళ్లి దొండ్లపల్లి తదితర గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్బంగా పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు ఇందిరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, డిసిసి వైస్  చైర్మన్ యాదయ్య, సర్పంచ్ సంతోషం వెంకటేష్, మాజీ ఎంపిటిసి సునీత శ్రీనివాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రమేష్,సత్యనారాయణ గౌడ్, విక్రమ్ రెడ్డి, రమణ, వెంకట్ నాయక్, నరేష్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు