మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు మారాలి
రిటైర్ట్ జర్నలిస్ట్, సీనియర్ ప్రొఫెసర్ స్టీవెన్ సన్
జడ్చర్ల, నవంబర్ 16: మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు(Journalists) మారాలని ఆవుడే ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురాగలుగుతామని ఉస్మానియా యూనివర్సిటి(Osmania University) గాడ్ ఆఫ్ జర్నలిజం రిటైర్డ్ సీనియర్ ప్రొఫెసర్ స్టీవెన్ సన్(Retired Senior Professor Stevenson) సందేశమిచ్చారు.
ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యవక్తగా హజరైన ఆయన మాట్లాడుతూ సమాజంలో మార్పులు అనివార్యమని, గతంలో వార్తాసేకరణ ఎంతో కష్టంగా ఉండేదని, ఇపుడు సులభతరంగా మారిందన్నారు. ఏఐ సాంకేతికతను వినియోగించి రోజు వారి ప్రణాళికలు విజయవంతంగా అమలు చేసుకోవచ్చన్నారు. గతంలో స్టోరి రాయాలని ముందుగా ప్రణాళికలు వేసుకోవాల్సి వచ్చేదని ఇపుడు ఏఐలో మన ప్రాంతంలో ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ ఏ స్టోరి ఎలా రాయాలో కూడా పూర్తిగా వివరిస్తుందన్నారు.
విలువలు కాపాడుకుంటూనే ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా ఉండాల్సిన ఆవసరం ఉందన్నారు. వార్తాసేకరణ, పొందుపర్చే విధానం, ఏ వైబ్సైట్లలో ఎలాంటి సమాచారం ఉంటుంది, ఏఐద్వారా ఎన్ని అద్భుతాలు చేయవచ్చో ఆయన క్షుణ్ణంగా వివరించారు. క్షేత్రస్థాయిలో జర్నలిస్టులకు కలిగే కష్టనష్టాలను సైతం ఆయన వివరిస్తూ ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించారు.
ప్రజలకు ఆసక్తి ఉన్న వార్తలు సేకరించటం ఒక కోణం అయితే జర్నలిస్టు సమస్యలను గుర్తించి వెలుగులోకి తీసుకురావటం మరో కోణమన్నారు. ప్రస్తుత కాలంలో ఏ వార్తను ఎంతమంది చూశారో తెలుసుకునే వెసులుబాటు వచ్చిందన్నారు. జాతీయ సమ్మేళనంలో రిటైర్ట్ జర్నలిస్టులు, ప్రస్తుత జర్నలిస్టులను శాలువా, ప్రశంసాపత్రం, షీల్డుతో ఘనంగా సత్కరించటం జరిగింది.
అంతకు ముందు స్టీవెన్సన్, ప్రిన్సిపా సుకన్య, ప్రెస్ క్లబ్ మాజి గౌరప అధ్యక్షుడు రవిశంకర్ లు జ్యోతి వెలిగించి సమ్మేళనం ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఆధ్యక్షుడు వి. కృష్ణ, ప్రధాన కార్యదర్శి సుల్తాన్, ఉపాధ్యక్షుడు శేఖర్, కోశాధికారి ప్రభాకర్, కార్యదర్శి మల్లేష్, కార్యవర్గసభ్యులు టి.శ్రీనివాస్, సంతోషి కిరణ్మయిలతోపాటు జడ్చర్ల, రాజాపూర్, మిడ్జిల్, నవాబుపేట జర్నలిస్టులు పాల్గొన్నారు.