18న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

16-11-2026 | 08:08pm

నస్పూర్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి సంస్థ(Singareni Company) ఆధ్వర్యంలో ప్రతీ నెల నిర్వహించే ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం(Ayurvedic Medical Camp) ఈ నెల 18న నస్పూర్ కాలనీలో నిర్వహించనున్నట్లు శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ సోమ వారం తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నస్పూర్ లోని మనోరంజన్ సముదాయ్ లో  ఈ ఆయుర్వేద వైద్య శిబిరం కొనసాగుతుందన్నారు.

హైదరాబాద్ లోని  మాతా రీసెర్చ్ సెంటర్ కు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ విశ్వానాథ మహర్షి ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుందని, దీర్ఘకాలిక వ్యాదులైన బీపీ, షుగర్ లతో పాటు మలబద్దకం, పక్షవాతం, కీళ్లనొప్పులు, వెన్ను నొప్పి ఇతర  వ్యాధులతో బాధపడే వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించటంతో పాటు మందులు అందజేస్తామన్నారు. సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు , స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు